Fri Dec 20 2024 12:06:54 GMT+0000 (Coordinated Universal Time)
Rangasthalam : రంగస్థలంలో రామ్‌చరణ్‌కి అన్నయ్యగా ఆ హీరో నటించాల్సింది..
రంగస్థలంలో రామ్ చరణ్‌కి అన్నయ్యగా ఆ హీరో నటించాల్సిందట. కానీ చివరికి ఆదిని ఫైనల్ చేశారు.
Rangasthalam : సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ 'రంగస్థలం'. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ కెరీర్ కి అయితే.. ఇదొక మైల్ స్టోన్ అయ్యింది. బ్రదర్ సెంటిమెంట్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ కి అన్నయ్య ఆది పినిశెట్టి నటించారు. అయితే ఆ పాత్ర కోసం ఆది కంటే ముందు సుకుమార్ మరో హీరోని ఎంపిక చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన ఎందుకు నటించలేదు..?
చిరంజీవితో ఖైదీ, అభిలాష, ఛాలెంజ్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన దర్శకుడు కోదండరామిరెడ్డి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో 'వైభవ్ రెడ్డి'. తెలుగు సినిమా 'గొడవ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ హీరోనే రంగస్థలంలో రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించాల్సిందట. వైభవ్, రామ్ చరణ్ కూడా కొంచెం చూడడానికి ఒకేలా ఉంటారు. సుకుమార్ కథ వినిపించగా వైభవ్ కూడా ఓకే చేశారట.
ఆ ఛాన్స్ తనకి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారట. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకున్నట్లు తెలియజేశారట. వైభవ్ చూడడానికి రామ్ చరణ్ లా ఉండొచ్చు. కానీ ఆయన చరణ్ కి తమ్ముడిగా కనిపిస్తారు. కానీ సినిమాలో అన్నయ్య పాత్ర చేయాల్సి ఉంది. ఈ కారణంతోనే వైభవ్ ని తప్పించినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని వైభవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి అవ్వనుందని చెబుతున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అవ్వాల్సిన 'జరగండి' సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ న్యూ ఇయర్ కి అయినా ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.
Next Story