Mon Dec 23 2024 08:36:06 GMT+0000 (Coordinated Universal Time)
Ritu Varma : మెగా హీరోతో రీతూ వర్మ రిలేషన్..?
మెగా హీరోతో రీతూ వర్మ సీక్రెట్ రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్నారా..? మెగా ప్రైవేట్ పార్టీలో ఆమె ఏం చేస్తున్నారు..?
Ritu Varma : తెలుగు అమ్మాయి రీతూ వర్మ.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో హీరోయిన్ కాజోల్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అయితే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా అంటే.. విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు'. ఆ తరువాత పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, గత కొన్ని రోజులు నుంచి రీతూ వర్మ ప్రేమ, పెళ్లి రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ హీరోయిన్ ఒక మెగా హీరోతో సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు రావడానికి కారణం.. ఇటీవల అల్లు అర్జున్ తన ఇంటిలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో మెగా హీరోలతో పాటు రీతూ వర్మ కూడా కనిపించారు.
దీంతో ఆమె కూడా లావణ్య త్రిపాఠిలా మెగా హీరోతో రహస్య ప్రేమాయణం నడుపుతున్నారా..? అనే సందేహం మొదలైంది. ఇక దీని గురించి మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వైష్ణవ తేజ్ నటించిన 'ఆదికేశవ' సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా.. వైష్ణవ్ కి రీతూ వర్మ గురించిన ప్రశ్న ఎదురైంది.
"మీ ప్రైవేట్ పార్టీలో రీతూ వర్మ ఏం చేస్తున్నారు..?" అని అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ బదులిస్తూ.. "ఆమె లావణ్యకి మంచి ఫ్రెండ్. అందుకనే ఆమె వచ్చారు. దానిని కూడా మీరు మరోలా చూస్తే ఎలా అండి" అంటూ బదులిచ్చారు. దీంతో మెగా హీరోతో రీతూ వర్మ సీక్రెట్ రిలేషన్ పై ఒక క్లారిటీ వచ్చింది.
Next Story