Mon Dec 23 2024 12:51:31 GMT+0000 (Coordinated Universal Time)
"వినరో భాగ్యము విష్ణుకథ" నుండి వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్
తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే
కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం హీరోగా, బన్నీవాసు నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించిన. ఫిబ్రవరి 18న.. మహా శివరాత్రి కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇటీవలే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. ఆ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం సినిమాకు సంబంధించిన ముచ్చట్లు చెప్పారు.
తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో, హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు. ఓ కుర్రాడు తన లవర్ వెంట పడుతూ పాడుకునే పాట ఇది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకర్షించేలా ఉంది. మురళీశర్మ, శుభలేఖ సుధాకర్ వినరో భాగ్యము విష్ణు కథలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరుస పరాజయాల తర్వాత.. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం.
Next Story