Mon Dec 23 2024 00:15:07 GMT+0000 (Coordinated Universal Time)
రూ.100 కోట్ల క్లబ్ లోకి "వాలిమై"
ఈ నెల 24న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. విడుదలైన..
చెన్నై : అజిత్.. ఈ హీరోకి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు అక్కడ హిట్ అవుతాయి. తాజాగా అజిత్ హీరోగా రూపొందిన సినిమా వాలిమై. ఈ నెల 24న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. విడుదలైన తొలిరోజే "వాలిమై" వసూళ్ల వర్షం కురిపించింది. తమిళనాడులో తొలిరోజే రూ.36 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక వీకెండ్ లో అయితే.. "వాలిమై" జోరు చెప్పనక్కర్లేదు. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా "వాలిమై" రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. మరికొన్ని రోజులపాటు అక్కడ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో.. "వాలిమై" హవానే కొనసాగుతుందని అంచనా. అయితే.. తెలుగులోనూ "వాలిమై" విడుదలైనా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. కారణమేంటో తెలిసే ఉంటుంది. భీమ్లా నాయక్ ఎఫెక్ట్. వాలిమై విడుదలైన మర్నాడే భీమ్లానాయక్ విడుదల కావడంతో తెలుగులో "వాలిమై"కి పెద్దగా వసూళ్లు రాలేదు.
Next Story