Mon Dec 23 2024 01:27:14 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ ఆడియన్స్ ని నిరాశపరిచిన కాంతారా
చాలా త్వరగా ఆ పాట ఫేమస్ అయింది. కానీ.. ఆ పాటకు వాడిన మ్యూజిక్ మాదేనంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టుకెక్కడంతో..
దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన సినిమా కాంతారా. తొలుత కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన కాంతారా.. ఆ తర్వాత పలు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టి.. కన్నడ చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్లస్ పాయింట్. దానివల్లే కాంతారా భారీ హిట్ కొట్టిందని థియేటర్ ఆడియన్స్ అభిప్రాయం. క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం సాంగ్, మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
చాలా త్వరగా ఆ పాట ఫేమస్ అయింది. కానీ.. ఆ పాటకు వాడిన మ్యూజిక్ మాదేనంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టుకెక్కడంతో.. ఆ సినిమాలో ఆ పాటను తీసేయాలంటూ కోర్టు కాంతారా టీమ్ కు ఆదేశాలిచ్చింది. థియేటర్లో రాని ఆ పాట.. ఓటీటీలోనైనా వస్తుందని ఎంతో ఎదురు చూసిన ఆడియన్స్ కి నిరాశ ఎదురైంది. వరాహరూపం మ్యూజిక్ ఓటీటీలోనూ రాలేదు. దీంతో ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు సినిమాలో ఆ పాటకి మ్యూజిక్ మార్చి రిలీజ్ చేశారు. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. పాత మ్యూజిక్ బాగుంది, ఇది బాగోలేదు. పాత వరాహ రూపం పాట కావాలని సోషల్ మీడియాలో #Varaharoopam హ్యాష్‌ట్యాగ్‌ని కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.
Next Story