వెనక్కి తగ్గిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలవుతుందో లేదో అనేది ఇంకా తేలలేదు. ఆ సినిమా ట్రైలర్ [more]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలవుతుందో లేదో అనేది ఇంకా తేలలేదు. ఆ సినిమా ట్రైలర్ [more]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలవుతుందో లేదో అనేది ఇంకా తేలలేదు. ఆ సినిమా ట్రైలర్ చూశాక వర్మ పైశాచికత్వం ఎంతెలా ఉందో అర్ధమవుతుంది. ఈ సినిమాని విడుదల చెయ్యొద్దు అంటూ కాంగ్రెస్ వాళ్ళు కేసు వేశారు. ఆ సినిమా సంగతి పక్కనపెడితే… నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ఇప్పటివరకు బాలకృష్ణ ని, టిడిపిని టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు మెగా ఫ్యామిలీని తగులుకున్నాడనే ప్రచారం జరిగింది. ఎందుకంటే గతంలో వర్మ మెగా ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ కి రామ్ చరణ్ ఇన్ డైరెక్ట్ గా, నాగ బాబు డైరెక్ట్ గానే వర్మకి కౌంటర్లు ఇచ్చారు.
గాసిప్స్ కు తెర…
బాలయ్య మీద పగ పట్టినట్లుగా వర్మ మళ్ళీ మెగా ఫ్యామిలీపై పగ పట్టి సినిమా మొదలెట్టాడని.. ఆ సినిమాలో మెగా ఫ్యామిలీ మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటాడా అనే ప్రచారం జరుగుతుంది. రాత్రి ‘మెగా ఫ్యామిలీ’ సినిమా పై ఈ రోజు వివరాలు వెల్లడిస్తాన్నని చెప్పిన వర్మ దానిపై మరో ట్వీట్ చేశాడు. ‘మెగా ఫ్యామిలీ’ సినిమాను తాను తెరకెక్కించలేనని, ‘మెగా ఫ్యామిలీ’ అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రమని… పిల్లలు చిత్రాలు తియ్యడంలో తనకు పెద్దగా అనుభవం లేదని, అందుకే ‘మెగా ఫామిలీ’ సినిమాని తాను తియ్యడం లేదని ట్వీట్ చేశాడు. ఒక్క రాత్రిలో అనేక గాసిప్స్ కి తెర లేపిన వర్మ ఇలా సైలెంట్ షాకివ్వడం, సినిమా తియ్యడం లేదని చెప్పడం మాత్రం మెగా ఫ్యామిలీకి ఊరటనిస్తోంది.