Mon Dec 23 2024 10:19:52 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో వరుడు కావలెను.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కాలేజీలో ప్రేమ- ఉద్యోగం- కుటుంబ అనుబంధాల మధ్య నడిచే
చాలా కాలం తర్వాత నాగశౌర్య ఖాతాలో హిట్ పడింది. అశ్వత్ధామ తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యను వరుడు కావలెను సినిమాతో.. హిట్ వరించింది. నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కాలేజీలో ప్రేమ- ఉద్యోగం- కుటుంబ అనుబంధాల మధ్య నడిచే ఈ సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉండటంతో.. మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు వరుడు కావలెను ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
జనవరి 7వ తేదీ నుంచి జీ5 లో ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. ఈ మేరకు జీ5 సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఆకాష్ - భూమి పాత్రల్లో కనిపించిన శౌర్య - రీతూ వర్మలు.. క్యారెక్టర్లో ఒదిగిపోయారనే చెప్పాలి. కూతురికి పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడుతున్న తల్లిగా నదియ కనిపిస్తారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందించారు.
Next Story