Thu Nov 28 2024 11:42:15 GMT+0000 (Coordinated Universal Time)
ముంబై ఆటోలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్.. వీడియో వైరల్..
ముంబై ఆటోలో వరుణ ధావన్ కలిసి చక్కర్లు కొట్టిన కీర్తి సురేష్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
ఇటీవల బాలీవుడ్ లోని స్టార్స్ అంతా సాధారణ ప్రజలు మాదిరి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపిస్తూ అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ముంబై ఆటో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సౌత్ స్టార్ కీర్తి సురేష్ కనిపించి సందడి చేశారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఆటో ఎందుకు రైడ్ చేశారు..? అసలు కీర్తి, వరుణ్ ధావన్ తో ఎందుకు ఉంది..? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూవీతోనే కీర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ షూటింగ్ భాగంలోనే కీర్తి ముంబై వెళ్ళింది. షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత వరుణ్ అండ్ కీర్తి కలిసి ఆటోలో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇక ఆటోలో వీరిద్దర్నీ చూసిన అభిమానులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో కీర్తి నార్మల్ డ్రెస్ లో ఉంటే, వరుణ్ బన్నీ పై కనిపిస్తున్నాడు.
కాగా ఈ మూవీని అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విజయ్ నటించిన తమిళ హిట్ మూవీ 'తేరి'కి రీమేక్ అని సమాచారం. కీర్తి సురేష్ తో పాటు మరో హీరోయిన్ గా 'వామికా గబ్బి' నటిస్తుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో సమంత పాత్ర చేస్తుందని తెలుస్తుంది. అట్లీ రీసెంట్ గా షారుఖ్ ఖాన్ 'జవాన్' తీసి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. దీంతో వరుణ్ ధావన్ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో ఐదు సినిమాల్లో నటిస్తుంది. ఈ ఐదు సినిమాలు లేడీ ఓరియంటెడ్ కావడమే కాకుండా, ఈ చిత్రాలు అన్ని తమిళ్ ఇండస్ట్రీకి చెందినవే. ఇక వరుణ్ విషయానికి వస్తే.. ఈ తేరి రీమేక్ తో పాటు సమంతతో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఆ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
Next Story