Tue Dec 24 2024 01:54:32 GMT+0000 (Coordinated Universal Time)
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్?
వరుణ్ - లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. అంతరిక్షం సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత..
మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ.. గతంలో వార్తలొచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఆ ఇద్దరూ వాటిపై స్పందించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరి గురించి మరో న్యూస్ వైరస్ అవుతోంది. అదే వారి ఎంగేజ్మెంట్, పెళ్లి. జూన్ మొదటి వారంలోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అది నిజమేనంటూ సోషల్ మీడియాలో పలువురు చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.
వరుణ్ - లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. అంతరిక్షం సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి టాలీవుడ్ నుండి ఏ హీరోయిన్ రాకపోయినా లావణ్య హాజరైంది. అప్పటి నుంచి వరుణ్ - లావణ్య రిలేషన్ పై మరిన్ని రూమర్స్ వచ్చాయి. మెగా ఫ్యామిలిలో జరిగే పలు ఫంక్షన్స్ కి, నిహారిక, వరుణ్ పార్టీలకు లావణ్య త్రిపాఠి కూడా హాజరవుతుండటంతో వరుణ్ - లావణ్యల నిశ్చితార్థం దాదాపు కన్ఫర్మ్ అయింది. తాజాగా జూన్ 9న కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యలో లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కన్ఫర్మ్ చేసేశాయి. ఇక మెగా వారింటి నుండి ఈ వార్తలపై కన్ఫర్మేషన్ రావలసి ఉంది.
Next Story