Mon Dec 23 2024 11:33:18 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సినిమాలో వరుణ్ తేజ్ కొత్త లుక్.. మోషన్ పోస్టర్, టైటిల్
మోషన్ పోస్టర్ విజువల్స్ చూస్తుంటే లండన్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గని సినిమా తర్వాత.. ఇంతవరకూ మరో సినిమా అప్డేట్ లేదు. తాజాగా వరుణ్ తేజ్ రెండు సినిమాల నుండి అప్డేట్స్ వచ్చాయి. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా.. రెండు సినిమాల నుండి పోస్టర్లు వదిలారు మేకర్స్. వరుణ్ 12వ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి వరుణ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ప్రకటించారు మేకర్స్.
మోషన్ పోస్టర్ విజువల్స్ చూస్తుంటే లండన్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో ఇంతకు ముందు చూడని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ కూడా వైవిధ్యంగా ఉంది. ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ తో అందరిలోనూ కొత్త ఆసక్తిని రేపారు.
ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను అధికారిగా ప్రకటించనున్నారు. కాగా.. వరుణ్ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ఘోస్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చేస్తున్న ఈ మూవీతో వరుణ్ కి కమర్షియల్ హిట్టుని అందిస్తాడా అనేది చూడాలి.
ఇక వరుణ్ 13వ సినిమా.. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో రాబోతోంది. ఆ సినిమాలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమా గురించి టైటిల్ లేదా.. ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Next Story