వరుణ్ ని కూల్ చేసిన RRR హీరోలు
వరుణ్ తేజ రీసెంట్ మూవీ వాల్మీకి లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ గా మారిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ మార్చిన రోజు [more]
వరుణ్ తేజ రీసెంట్ మూవీ వాల్మీకి లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ గా మారిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ మార్చిన రోజు [more]
వరుణ్ తేజ రీసెంట్ మూవీ వాల్మీకి లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ గా మారిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ మార్చిన రోజు రాత్రి దర్శకుడు హరీష్ నిద్ర లేకుండా గడిపానని చెప్పాడు. ఇక వరుణ్ తేజ్ కూడా లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్పు విషయంలో చాల స్ట్రెస్ ఫీల్ అయ్యాడట. టైటిల్ మార్చామని తన అన్న చరణ్ కి వరుణ్ ఫోన్ చేస్తే.. ఇంటికి రా మాట్లాడదాం అన్నాడట చరణ్. అయితే వరుణ్ తేజ్ పిచ్చ స్ట్రెస్ లో చరణ్ ఇంటికి వెళ్లగా అక్కడ తారక్, చరణ్ లు కాఫీ తాగుతూ ఉన్నారట. తారక్, చరణ్ లు వాల్మీకి టైటిల్ విషయంలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వరుణ్ ని ఎంతో కూల్ చేసి వరుణ్ స్ట్రెస్ ని జీరో లోకి తెచ్చారట. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ గత రాత్రి గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో చెప్పడమే కాదు.. RRR హీరోలిద్దరికి థ్యాంక్స్ కూడా చెప్పాడు.