Thu Dec 26 2024 16:45:29 GMT+0000 (Coordinated Universal Time)
VarunLav : మెగా జంటకి పూలవర్షంతో అభిమానుల స్వాగతం..
మెగా అభిమానులు మెగా జంటకి పులా వర్షంతో స్వగతం పలికారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద వరుణ్ లావణ్యకి..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. తమ ఐదేళ్ల ప్రేమ ప్రయాణం నుంచి పెళ్లి ప్రయాణంలోకి అడుగు పెట్టేశారు. ఇటలీలోని టస్కనీ నగరంలో నవంబర్ 1న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా అండ్ అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ, బంధుమిత్రులు, కొందరు సినీ సెలబ్రిటీస్ కలిసి సందడి చేశారు. ఇక ఇటలీలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న మెగా కుటుంబం.. ఒక్కొక్కరిగా ఇండియా చేరుకుంటున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హైదరాబాద్ చేరుకోగా, నేడు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు వరుణ్ లావణ్య కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ కొత్త జంటకి ఎయిర్ పోర్ట్ వద్ద ఘానా స్వగతం కలిగింది. మెగా అభిమానులు మెగా జంటకి పులా వర్షంతో స్వగతం పలికారు. వరుణ్ లావణ్యకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story