పెళ్లి షాపింగ్ మొదలుపెట్టిన వరుణ్, లావణ్య..
హాలిడే వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో కలిసి పెళ్లి షాపింగ్ మొదలు పెట్టేశాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హాలిడే వెకేషన్ నుంచి తిరిగి వచ్చేశాడు. ఇటీవల తన ఫ్యామిలీ మెంబెర్స్ (నాగబాబు దంపతులు, నిహారిక) తో కలిసి ఆఫ్రికా టూర్ కి వెళ్లిన వరుణ్.. అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడి హ్యాపీ మూమెంట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వచ్చాడు. ఇక ఆ టూర్ ముగించుకొని ఇండియా వచ్చిన వరుణ్.. ఇప్పుడు పెళ్లి పనుల్లోకి దిగాడు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ని వరుణ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మెగా వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోతుంది. ఇక ఈ మ్యారేజ్ కోసం ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కొన్ని ప్లేస్లని పరిశీలిస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ మెగా వెడ్డింగ్ కి ఏ దేశం వేదిక అవుతుందో చూడాలి. అలాగే పెళ్లి తేదీ పై మెగా అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
కాగా వరుణ్ అండ్ లావణ్య.. దాదాపు ఐదేళ్ల పటు రహస్య ప్రేమాయణం నడిపారు. ఇద్దరు కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో కలిసి నటించారు. ఈ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ ప్రేమని ఎక్కడా బయట పడనివ్వకుండా వచ్చి.. ఎంగేజ్మెంట్ తరువాత అందరికి తెలియజేశారు.