వరుణ్ తేజ్ ఫ్యామిలీ వెకేషన్ టూర్ అందుకోసమేనా..?
వరుణ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ టూర్ కోసం ఫారిన్ చెక్కేశాడు. అయితే వరుణ్ వెళ్ళింది కేవలం వెకేషన్ కోసమే కాదు..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. టీజర్ అండ్ ట్రైలర్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్నప్పటికీ థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించలేక ప్లాప్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే, వరుణ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ టూర్ కోసం ఫారిన్ చెక్కేశాడు. నిహారికతో (Niharika Konidela) పాటు కుటుంబంలోని నలుగురు కలిసి 'కెన్యా' వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇక అక్కడి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వరుణ్, నిహారిక, నాగబాబు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్ అండ్ ఫ్యామిలీ కేవలం వెకేషన్ కోసమే కాదు వేరే పని మీద కూడా ఫారిన్ వెళ్లినట్లు చెబుతున్నారు. త్వరలో వరుణ్ పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకోసం ఇండియా అండ్ ఫారిన్ కంట్రీస్ లోని పలు లొకేషన్స్ ని పరిశీలిస్తున్నట్లు.. గాండీవధారి అర్జున ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే వరుణ్ ఫ్యామిలీతో కలిసి కెన్యా వెళ్లి ఉండవచ్చు అని చెబుతున్నారు. కాగా వరుణ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ని ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్‌లు మార్చుకునే అంతవరకూ ఈ ప్రేమ వ్యవహారాన్ని గోప్యంగానే ఉంచుతూ వచ్చారు.