Mon Dec 23 2024 12:11:36 GMT+0000 (Coordinated Universal Time)
గని ట్రైలర్.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ ఖాయం
"నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు." "సొసైటీ ఎప్పుడు గెలిచే వారి మాటే నమ్ముతుంది" "లైఫ్ లో మంచోడ్ని ..
హైదరాబాద్ : కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా గని. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ రెండేళ్లు కష్టపడ్డాడు. బాడీ బిల్డర్ గా, బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించేందుకు కావల్సిన లుక్ కోసం.. స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. తాజాగా గని నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మొదటిలో.. లైఫ్ లో బాక్సింగ్ ఆడనని మాటివ్వు అంటూ గని తల్లి ప్రామిస్ తీసుకుంటుంది. కానీ తల్లికి తెలియకుండా గని బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుని, నేషనల్ ఛాంపియన్ గా ఎదగాలనుకుంటాడు. ఆ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.
వరుణ్ తేజ్ కి ప్రత్యర్థిగా ఆది పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తాడు. "నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు." "సొసైటీ ఎప్పుడు గెలిచే వారి మాటే నమ్ముతుంది" "లైఫ్ లో మంచోడ్ని కెలుకు.. చెడ్డోడ్ని కెలుకు.. కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోణ్ణి మాత్రం కెలక్కు" వంటి డైలాగ్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ ని బట్టి చూస్తే.. గనికి బాక్సింగ్ లో ట్రైనర్ గా ఉన్న వ్యక్తే అతని తండ్రి అని తెలుస్తుంది. బాక్సింగ్ వదిలేయాలని గని తల్లి ఎందుకు మాట తీసుకుంది ? గని తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు ? అనే విషయాలు ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. గని తల్లి పాత్రను నదియా పోషించారు. జగపతి బాబు, సునీల్ శెట్టి, మహేష్ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టిలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ అందించిన గని సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది.
News Summary - Varun Tej's Gani Trailer Out Now
Next Story