Mon Dec 23 2024 12:15:03 GMT+0000 (Coordinated Universal Time)
''గని'' విడుదల తేదీ ఖరారు.. మరి భీమ్లా నాయక్ సంగతేంటి ?
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''గని''. ఫైనల్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది..
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''గని''. ఫైనల్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ నెల 25న గని సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సయీ మంజ్రేకర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. సినిమా విడుదల తేదీ ప్రకటన సందర్భంగా వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. మూడేళ్ల కష్టానికి.. తగిన ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, ప్రేక్షకుల ఆదరాభిమానాలను తప్పకుండా అందుకుంటామన్న నమ్మకం తమకు ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : వైఎస్ షర్మిల అరెస్ట్
అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. కాగా.. అదే రోజున శర్వానంద్ నటించిన ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' సినిమా కూడా విడుదల కానుంది. భీమ్లా నాయక్ విడుదలపై ఇంతవరకూ చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. మరి అబ్బాయ్ సినిమా విడుదలకు రెడీ అవ్వడంతో.. బాబాయ్ సినిమా విడుదల మరోసారి వాయిదా పడుతుందా ? లేక ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 25నే విడుదల చేస్తారా ? అన్న విషయంపై భీమ్లా నాయక్ బృందం స్పందించాల్సి ఉంది.
News Summary - Varun Tej's Ghani Movie Released on February 25th
Next Story