Mon Dec 30 2024 20:19:53 GMT+0000 (Coordinated Universal Time)
రెండు వారాలకే ఓటీటీ లో గని.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..
విడుదలైన రెండు వారాలకే గని సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 8న థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం కేవలం..
హైదరాబాద్ : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కెరీర్ మొదటి నుంచి ఎక్కువగా లవ్ స్టోరీల్లో నటించిన వరుణ్ తేజ్.. గని సినిమాలో మాత్రం బాక్సర్ గా కనిపించాడు. యాక్షన్ మూవీ కావడంతో.. ప్రేక్షకులను గని ఆకర్షించలేకపోయాడు. అంచనాలకు తగ్గ ఫలితాలు రాక.. బాక్సాఫీస్ వద్ద గని బోల్తా పడింది.
విడుదలైన రెండు వారాలకే గని సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 8న థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం కేవలం పదిహేను రోజుల్లోనే ఆహాలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని తెలుగు ప్లాట్ఫామ్ ఆహా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి గని సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతిబాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.
Next Story