లూసిఫెర్ రీమేక్ లేట్.. వేదాళం రీమేక్ ఫిక్స్!!
మెగాస్టార్ ఆచార్య షూట్ షురూ అయ్యింది. ఆచార్య రీ షూటింగ్ నవంబర్ 9 నుండి అని ప్రకటించింది టీం. మరి చిరంజీవి – కొరటాల ఆచార్య షూటింగ్ [more]
మెగాస్టార్ ఆచార్య షూట్ షురూ అయ్యింది. ఆచార్య రీ షూటింగ్ నవంబర్ 9 నుండి అని ప్రకటించింది టీం. మరి చిరంజీవి – కొరటాల ఆచార్య షూటింగ్ [more]
మెగాస్టార్ ఆచార్య షూట్ షురూ అయ్యింది. ఆచార్య రీ షూటింగ్ నవంబర్ 9 నుండి అని ప్రకటించింది టీం. మరి చిరంజీవి – కొరటాల ఆచార్య షూటింగ్ మొదలు కాగానే 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అసలు ఎలాంటి ఆటంకాలు, గ్యాప్ లేకుండా ఈ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లే.. చిరంజీవి నెక్స్ట్ సినిమా విషయంలోనూ భారీ ప్లాన్ లో చిరు ఉన్నాడని తెలుస్తుంది. మాములుగా ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి లూసిఫెర్ రీమేక్ చెయ్యాలి.. కానీ ప్రస్తుతానికి లూసిఫెర్ సినిమా రీమేక్ కి డైరెక్టర్ ప్రాబ్లెమ్ కావడంతో.. మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ చెయ్యాలని చిరు గట్టిగా ఫిక్స్ అయ్యాడట.
అందుకే లాక్ డౌన్ లో వేదాళం రీమేక్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడట చిరంజీవి. అంటే ఆచార్య సినిమా షూటింగ్ ఎండ్ కార్డు పడుతుంది అనగానే చిరు వేదాళం రీమేక్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఆచార్య సినిమా వేసవిలో విడుదల అంటూ గ్రాండ్ గా ప్రకటించారు. అంటే చిరంజీవి – మెహెర్ రమేష్ సినిమా ఫిబ్రవరి నుండి మొదలు కావొచ్చని అంటున్నారు. వేదాళం రీమేక్ ని మెహెర్ రమేష్ ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని చూస్తున్నాడట. అయితే వేదాళం రీమేక్ కోసం బ్యాగ్ రౌండ్ లో ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ.. ఆ సినిమా విషయంలో ఆఫీసియల్ ప్రకటన మాత్రం మెగా కాంపౌండ్ ఇవ్వడం లేదు. కానీ ఖచ్చితంగా చిరు ఆచార్య తర్వాత వేదాళం రీమేక్ మొదలు పెట్టబోతున్నాడని.. ఇది ఫిక్స్ అంటున్నారు.