చిరు వేదాళం రీమేక్ స్టార్ట్ అయ్యిందా?
చిరంజీవి వరస సినిమాల కమిట్మెంట్స్ తో మెగా ఫాన్స్ హ్యాపీ. కానీ ఈ వయసులో చిరు వరస సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. అంటే చిరు సాధ్యమే అని [more]
చిరంజీవి వరస సినిమాల కమిట్మెంట్స్ తో మెగా ఫాన్స్ హ్యాపీ. కానీ ఈ వయసులో చిరు వరస సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. అంటే చిరు సాధ్యమే అని [more]
చిరంజీవి వరస సినిమాల కమిట్మెంట్స్ తో మెగా ఫాన్స్ హ్యాపీ. కానీ ఈ వయసులో చిరు వరస సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. అంటే చిరు సాధ్యమే అని చెబుతున్నాడు. ఇప్పటివరకు ఆచార్య షూటింగ్ లేట్ అవడం చిరూ తదుపరి ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్లడం జరిగింది. వయసు రీత్యా చిరూ ఒకటి తర్వాత ఒక సినిమా పూర్తి చేస్తాడని అనుకుంటున్నారు. కానీ చిరు వరస కమిట్మెంట్స్ చూస్తే.. రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తాడేమో అనిపించేలా ఉన్నాయ్. తాజాగా మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కి ఓకె చెప్పిన చిరు.. అంతే ఫాస్ట్ గా లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నాడు. కానీ ఆచార్య షూటింగ్ తో పాటుగా వేదాళం షూటింగ్ కూడా అనుకుంటే.. లేదు చిరూ ఆచార్య పూర్తి చేసాక అంటే వచ్చే ఏప్రిల్ నుండి వేదాళం రీమేక్ లోకి వెళ్లాడని అన్నారు. కానీ వేదాళం రిమేక్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు.
చిరు లేకుండానే వేదాళం రీమేక్ ని మెహర్ రమేష్ మొదలు పెట్టినట్టుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది. వేదాళం రీమేక్ షూటింగ్ మొదలవడమే కాదు… కొన్ని మాంటేజ్ షాట్స్ కూడా చిత్రీకరించారని అంటున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరక్కేయబోయే ఈ సినిమాలో మాంటేజ్ షాట్స్ కావాల్సి రావడంతో మెహర్ రమేష్ బ్యాచ్ అక్కడ కలకత్తాలో దసరా ఉత్సవాలు జరిగే టైం లోనే కొన్ని షాట్స్ షూట్ చేసుకుని వచ్చిందట.. ఆ షాట్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తాయని.. సో ఆ షాట్స్ షూట్ తోనే వేదాళం ఆఫీషి యల్ గా మొదలిపోయినట్టే అంటున్నారు. ఆ దసరా ఉత్సవాల సన్నివేశాలు సినిమాకి కీలకం కాబట్టి వచ్చే దసరా వరకు ఆగి మళ్ళీ ఆ సన్నివేశాల షూట్ చేస్తే లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మెహర్ అలా చేసాడట. అందుకే చిరు లేకుండా మెహర్ వేదాళం రీమేక్ సన్నివేశాల షూట్ మొదలెట్టాడన్నమాట.
- Tags
- Vedalam Remake