Sun Dec 22 2024 22:05:24 GMT+0000 (Coordinated Universal Time)
వీరసింహారెడ్డి సెన్సార్ పనులు పూర్తి..
వీరసింహారెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ మూవీగా..
అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సంక్రాంతి కానుకగా.. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.
వీరసింహారెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ మూవీగా వచ్చిందని, అభిమానులకు ఈ సినిమాతో బాలయ్య కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. వీరసింహారెడ్డిలో బాలయ్య చెప్పిన డైలాగులు ఆడియన్స్ ను, అభిమానులను ఆకట్టుకుంటాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Next Story