Sun Dec 22 2024 22:43:14 GMT+0000 (Coordinated Universal Time)
వేదిక మారిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్
ఒంగోలులో నేడు వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే వేదిక మాత్రం మారింది
ఒంగోలులో నేడు వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తొలుత ఏబీఎం కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, గ్రౌండ్ చిన్నదిగా ఉండటంతో పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒంగోలుకు నేడు వీరసిహారెడ్డి
పోలీసుల సూచనల మేరకు వీర సింహారెడ్డి వేదికను మార్చారు. ఏబీఎం కళశాల మైదానం నుంచి ఒంగోలు శివారు ప్రాంతానికి నిర్వాహకులు తరలించారు. గతంలో ఇదే ప్రాంగణంలో మహానాడు జరిగింది. అక్కడే ఈ ఈవెంట్ ను కూడా చేయాలని నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలయ్య ఒంగోలుకు వస్తుండటంతో పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది. సభ ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story