Sun Dec 22 2024 22:55:06 GMT+0000 (Coordinated Universal Time)
ఒంగోలు వేదికగా.. "వీరసింహారెడ్డి" ప్రీ రిలీజ్ ఈవెంట్
తాజాగా.. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ వచ్చింది. ఈవెంట్ డేట్, వేదికను చిత్రబృందం ఖరారు చేసింది.
బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో.. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. శృతిహాసన్ హీరోయిన్ గా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 12న విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. వీరసింహారెడ్డి పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజాగా.. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ వచ్చింది. ఈవెంట్ డేట్, వేదికను చిత్రబృందం ఖరారు చేసింది. ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కొత్తపోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలకృష్ణకు ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, శేఖర్ మాస్టర్ స్టెప్స్ తో పాటు.. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.
Next Story