Mon Dec 23 2024 18:53:19 GMT+0000 (Coordinated Universal Time)
పాన్ ఇండియా లెవల్లో.. వెంకీమామ 75వ సినిమా
‘హిట్’ వర్స్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శైలేష్ కొలను తీసిన రెండు సినిమాలు..
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన హీరో విక్టర్ వెంకటేష్ తన 75వ సినిమాని ప్రకటించాడు. ఎవరూ ఊహించని రీతిలో.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని రెడీ చేస్తున్నాడు. ఈరోజు (బుధవారం) టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. రెండు నిమిషాల నిడివిగల గ్లింప్స్ ని రిలీజే చేశారు. ఈ వీడియోలో వెంకటేష్ కూల్ అండ్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ గ్లింప్స్ లో సౌత్ ఇండియాలోని ఒక పోర్ట్ ఏరియాని చూపించారు.
వెంకటేష్ నడుచుకుంటూ వెళ్లి.. బైక్ మీద ఉన్న బాక్స్ లో నుంచి కెమికల్ బాంబు ఒకటి తీసి చూస్తాడు. ఆ తరువాత వెపన్స్ ఉన్న కంటైనర్ లోకి వెళ్లి గన్ తీసుకుని బయటకి వచ్చి బైక్ మీద కూర్చొని డైలాగ్ చెబుతాడు. ‘నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, రమ్మను’ అని ముందు కొట్టిపడేసిన రౌడీలకు చెప్తాడు. టీజర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా ఒక గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ‘సైంధవ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
‘హిట్’ వర్స్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శైలేష్ కొలను తీసిన రెండు సినిమాలు హిట్టయ్యాయి.. కానీ.. వెంకీ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ బాధ్యతల్ని కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ కి అప్పజెప్పడం ఏంటని చాలా మంది అనుకున్నారు కానీ.. గ్లింప్స్ చూశాక వారందరి అభిప్రాయాలు మారి, ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. "సైంధవ్" కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Next Story