Mon Dec 23 2024 08:00:41 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : విజయవాడ బాబాయ్ హోటల్లో వెంకీ మామ సందడి..
విజయవాడ బాబాయ్ హోటల్లో వెంకీ మామ సందడి చేశారు. అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చి అభిమానులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
Venkatesh : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన 75వ సినిమా 'సైంధవ్'ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహిస్తూ సందడి చేస్తుంది. ఈక్రమంలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ మూవీ యూనిట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించారు. వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, శైలేష్ కొలను దుర్గమ్మని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి దేవి అశీసులు తీసుకున్నారు. ఇదే ఇలా ఉంటే, వెంకటేష్ విజయవాడలోని బాబాయ్ హోటల్కి సడన్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అక్కడ ఉన్న కస్టమర్స్ తో కలిసి కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేసి సందడి చేశారు.
కారులో నుంచి సడన్ గా దిగి వచ్చి హోటల్ టిఫిన్ చేస్తున్న వారిని పలకరించి.. ఏ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ. నన్ను ఏం తినమంటారు అని అడిగారు. సడన్ గా వెంకీ మామని చూసిన కస్టమర్స్ షాక్ అయ్యారు. ఇక వాళ్ళు ఇడ్లీ తినమని సలహా ఇస్తే.. అక్కడ అందరితో కలిసి ఇడ్లీ తింటూ అందరితో మాట్లాడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుంటే, ఒక ముఖ్య పాత్రలో తమిళ్ హీరో ఆర్య కనిపించబోతున్నారు. అలాగే శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, రుహానీ శర్మ.. తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Next Story