Mon Dec 23 2024 07:36:22 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : భారత్ క్రికెట్ ఆటగాళ్లు పై వెంకీ మామ కామెంట్స్ వైరల్..
వరల్డ్కప్పై వెంకీ మామ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అన్ని గెలిచి ఒక్క మ్యాచ్ ఓడిపోయి..
Venkatesh : ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడం అందర్నీ చాలా బాధకి గురి చేసింది. ఫస్ట్ నుంచి అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్ కి చేరిన భారత జట్టు.. తుదిపోరులో కూడా విజయం సాధిస్తారని ఆశించారంతా. కానీ ఆ ఒక్క మ్యాచ్ అందరి ఆశలు పై నీళ్లు పోసింది. కోట్లమంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యేలా చేసింది. ఇక సినిమాతో పాటు క్రికెట్ ని కూడా అమితంగా ప్రేమించే మన వెంకీ మామ కూడా ఓడిపోయినందుకు చాలా బాధ పడ్డారు.
క్రికెట్ లవర్ అయిన వెంకటేష్.. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా వీక్షించారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన తరువాత.. వెంకటేష్ టీం ఇండియాని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. తాజాగా ఈయన ఈ మూవీ ఫంక్షన్ లో ఈ వరల్డ్ కప్ గురించి ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వెంకటేష్ నటిస్తున్న కొత్త మూవీ.. ‘సైంధవ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని స్టూడెంట్స్ మధ్య కాలేజీలో ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. "నాకు ఇంత మంచి స్వాగతం పలికిన అందరికి థాంక్యూ. ‘సైంధవ్’ సినిమా గురించి మాట్లాడేముందు మీరంతా ఒకసారి మన టీం ఇండియాకి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. వాళ్ళు ఓడిపోయింది ఒక మ్యాచ్ మాత్రమే. కానీ ఈ వరల్డ్ కప్ లో వాళ్ళు ఇచ్చిన పర్ఫామెన్స్ అద్భుతం. మన ఇండియన్ టీం గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్, కోహ్లీ, సిరాజ్, రాహుల్.. ఇలా అందర్నీ చూసి మనం గర్వపడాలి. ఈ వరల్డ్ కప్ ఓడిపోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ కప్ తప్పకుండా గెలుస్తారు" అంటూ క్రికెట్ పై తనకి ఉన్న ప్రేమని మరోసారి తెలియజేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ‘సైంధవ్’ విషయానికి వస్తే.. ఇది వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్షన్ లో ‘రాంగ్ యూసేజ్’ అనే సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటకి చంద్రబోస్ ఇచ్చి లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
Next Story