వెంకీ అంతా ప్రైవేట్ గానే చేస్తాడు..!
వెంకటేష్ కామెడీ, యాక్షన్ హీరోగా సినిమాల్లో నటిస్తాడు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి నచ్చే సినిమాలే చేస్తున్న వెంకీ.. తన పర్సనల్ లైఫ్ ని మాత్రం పర్సనల్ గానే [more]
వెంకటేష్ కామెడీ, యాక్షన్ హీరోగా సినిమాల్లో నటిస్తాడు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి నచ్చే సినిమాలే చేస్తున్న వెంకీ.. తన పర్సనల్ లైఫ్ ని మాత్రం పర్సనల్ గానే [more]
వెంకటేష్ కామెడీ, యాక్షన్ హీరోగా సినిమాల్లో నటిస్తాడు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి నచ్చే సినిమాలే చేస్తున్న వెంకీ.. తన పర్సనల్ లైఫ్ ని మాత్రం పర్సనల్ గానే ఉంచుతాడు. వెంకటేష్ భార్య, కూతుళ్లు, కొడుకు ఎక్కడా ఫోకస్ కారు. ఫ్యామిలీస్ ని పబ్లిక్ ఫంక్షన్స్ కి వెంకీ ఎప్పుడూ తీసుకురాలేదు కాబట్టి ఆయన ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తాజాగా దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. వెంకటేష్ కూతురు ఆశ్రితకి ఈమధ్యనే నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న ఈ జంట నిశ్చితార్ధ వేడుకలు చాలా కొద్దిమంది సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది దగ్గుబాటి ఫ్యామిలీ.
రాజస్తాన్ లో వివాహం
ఇక తాజాగా ఈ వారంలోనే దగ్గుబాటి వారి ఆడపడుచు ఆశ్రిత పెళ్లి రాజస్థాన్ లో జరగబోతుంది. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కూడా తన కొడుకు కార్తికేయ పెళ్లిని రాజస్థాన్ లోనే చేసాడు. ఇక తాజాగా వెంకటేష్ తన కూతురు ఆశ్రిత పెళ్లిని కూడా రాజస్థాన్ లోనే చేస్తున్నాడు. ఈ వారంలో జరగబోయే ఈ పెళ్లికి టాలీవడ్ లోని అతి ముఖ్యమైన వారికి మాత్రమే ఆహ్వానాలు పంపారట. ఇక ఈ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు కుటుంబంతో పాటు వెంకీ బంధువులు, టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది పాల్గొంటారని.. ఇక సంగీత్ వేడుకల్లో దగ్గుబాటి ఫ్యామిలీలోకి కొత్తగా అడుగుపెట్టిన సమంత, చైతు, రానా వంటి వారు అదిరిపోయే స్టెప్స్ వెయ్యాలని కాచుకుని కూర్చున్నారట.
ఘనంగా వివాహ విందు
ఇక పెళ్లిని ప్రైవేట్ గా చేసినా వివాహ విందు మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలేమీ మీడియాకి దొరక్కుండా వెంకీ అండ్ ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పెళ్లికి సంబంధించిన ఫొటోలేవీ బయటికి రాకుండా చూసుకుంటారట. ఇక హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ లోని ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తుంది.