Mon Dec 23 2024 15:54:29 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : చిరంజీవి దీపావళి వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్ సందడి..
చిరంజీవి ఇంట దీపావళి వేడుకలు. రామ్ చరణ్తో కలిసి వెంకీ మామ, మహేష్, ఎన్టీఆర్ సందడి.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రతి పండగని కుటుంబంలోని అందరితో కలిసి చాలా సందడిగా జరుపుకుంటుంటారు. ఏదైనా పండగా వచ్చిందంటే చాలు.. మెగా, అల్లు ఫ్యామిలీస్ అంతా చిరు ఇంటిలో చేరి సందడి చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు టాలీవుడ్ లోని ఇతర హీరోలు కూడా మెగా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేస్తారు. తాజాగా దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట ఒక ఫెస్టివల్ పార్టీ జరిగింది.
ఈ దివాళీ బ్యాష్లో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నిన్న నైట్ ఈ పార్టీ జరిగింది. ఇక ఒకే ఫ్రేమ్ ల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, వెంకీ, మహేష్, ఎన్టీఆర్ కనిపిస్తున్న ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్ లు చూసుకున్న అభిమానులు సంబర పడుతున్నారు.
ఇక మరో ఫ్రేమ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సతీమణులు ఉపాసన, నమ్రతా, లక్ష్మి ప్రణతి, స్నేహారెడ్డి కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను నమ్రతా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ పిక్స్ లో అల్లు స్నేహారెడ్డి కూడా ఉండడంతో అల్లు అర్జున్ ఫోటో కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి అప్లోడ్ చేసే ఫోటోలు కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
Next Story