Mon Dec 23 2024 01:57:48 GMT+0000 (Coordinated Universal Time)
Nag-Venky: సంక్రాంతి బరిలో వెంకీ, నాగ్ ఎన్నిసార్లు విజయం సాధించారు..?
వెంకటేష్, నాగార్జున ఇప్పటివరకు ఎన్నిసార్లు పండగ బరిలో నిలిచారు..? ఎన్నిసార్లు విజయం సాధించారు..?
Nagarjuna - Venkatesh : ఈ సంక్రాంతికి నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ పండగ భారీలో మహేష్ బాబు, తేజ సజ్జ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు. అసలు వెంకటేష్, నాగార్జున ఇప్పటివరకు ఎన్నిసార్లు పండగ బరిలో నిలిచారు..? ఎన్నిసార్లు విజయం సాధించారు..?
వెంకటేష్..
టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా సంక్రాంతికి సినిమాలు తీసుకు వచ్చింది వెంకటేషే అనుకుంటా. ఎందుకంటే ఇప్పటివరకు 14 సార్లు వెంకటేష్ సంక్రాంతి బరిలో పోటీ చేశారు. ఈ సినిమాల్లో రెండు ప్లాప్‌లు, మూడు యావరేజ్‌లు, కొన్ని సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
1988 సంక్రాంతి - 'రక్త తిలకం' మూవీ సూపర్ హిట్టు.
1989 సంక్రాంతి - 'ప్రేమ' వెంకటేష్ కెరీర్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్టు.
1992 సంక్రాంతి - 'చంటి' ఇండస్ట్రీ హిట్టు కొట్టింది.
1995 సంక్రాంతి - 'పోకిరి రాజా' యావరేజ్ ని ఇచ్చింది.
1996 సంక్రాంతి - 'ధర్మ చక్రం' వెంకటేష్‌ని యాంగ్రీ లుక్ పరిచయం చేసి సూపర్ హిట్టుగా నిలిచింది.
1997 సంక్రాంతి - 'చిన్నబ్బాయి' సంక్రాంతి పోటీలో ఫస్ట్ ప్లాప్ ఇచ్చింది.
2000 సంక్రాంతి - 'కలిసుందాం రా' అంటూ ఇండస్ట్రీ హిట్ తో పాటు నేషనల్ అవార్డుని కూడా ఇచ్చింది.
2001 సంక్రాంతి - 'దేవి పుత్రుడు' విజువల్ వండర్ అనిపించుకున్నా కమర్షియల్ గా ప్లాప్.
2006 సంక్రాంతి - 'లక్ష్మి' సూపర్ హిట్టు.
2010 సంక్రాంతి - 'నమో వేంకటేశ' యావరేజ్ తో సరిపెట్టింది.
2012 సంక్రాంతి - 'బాడీగార్డ్' ఎబో యావరేజ్ ని ఇచ్చింది.
2013 సంక్రాంతి - 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' బ్లాక్ బస్టర్ హిట్.
2015 సంక్రాంతి - 'గోపాల గోపాల' అంటూ సూపర్ హిట్ అందుకున్నారు.
2019 సంక్రాంతి - 'F2'తో నవ్వించి హిట్ అందుకున్నారు.
సంక్రాంతి రేసులో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న వెంకటేష్.. మరి ఈసారి ‘సైంధవ్’తో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.
నాగార్జున..
నాగార్జున సంక్రాంతి బరిలో చాలా తక్కువసార్లే పోటీకి దిగారు. కానీ పోటీకి వచ్చిన ప్రతిసారి పందెం కోడిలా విజయాన్ని అందుకొని సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. మొత్తం ఐదు సార్లు వస్తే.. ఐదు విజయాలే అందుకున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
1987 సంక్రాంతి - 'మజ్ను'గా ప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నారు.
1992 సంక్రాంతి - ఈసారి 'కిల్లర్'గా మరి సూపర్ హిట్టుని అందుకున్నారు.
1998 సంక్రాంతి - 'ఆవిడ మా ఆవిడే' అంటూ తన కష్టంతో మనల్ని నవ్వించి హిట్టుని నమోదు చేశారు.
2016 సంక్రాంతి - 'సోగ్గాడే చిన్ని నాయనా'తో కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకొని హిట్ కొట్టారు.
2022 సంక్రాంతి - 'బంగార్రాజు' మరోసారి సోగ్గాడుగా మెప్పించి సక్సెస్ ని అందుకున్నారు.
సంక్రాంతి పోటీకి వచ్చిన ప్రతిసారి సక్సెస్ ని అందుకున్న నాగార్జున.. మరి ఈసారి ‘నా సామిరంగ’తో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.
Next Story