Mon Dec 23 2024 06:22:40 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : నానికి తెలియని ఓ నిజాన్ని బయటపెట్టిన వెంకీ.. చిరు మూవీ..
నానితో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసిన వెంకటేష్.. నానికి కూడా తెలియని ఒక పాత విషయాన్ని బయటపెట్టారు.
Venkatesh : ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే అలా చేసి కొందరు హిట్స్ అందుకుంటారు, కొందరు ప్లాప్స్ చూస్తారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన రెండు హిట్టు స్టోరీలను మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని చేసి కొంచెం అటు ఇటు రిజల్ట్స్ ని అందుకున్నారు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి..?
2019లో నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమా కథ అయితే వెంకటేష్ కోసమే రాశారట. ఈ విషయం నాని కూడా తెలియదు. రీసెంట్ గా నానితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. వెంకటేష్.. "జెర్సీ కథ నాకోసమే రాశారు. కానీ ఆ టైములో అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇది ఎవరికి తెలియదు" అని చెప్పుకొచ్చారు. వెంకటేష్ మంచి క్రికెట్ ప్లేయర్ అని అందరికి తెలిసిందే. జెర్సీ సినిమా కూడా క్రికెట్ నేపథ్యంతోనే సాగుతుంది.
ఈ విషయాన్ని వెంకటేష్ ఇప్పుడు బయటపెట్టడంతో అభిమానులతో పాటు నాని కూడా షాక్ అయ్యారు. మీరు క్రికెట్ ప్లేయర్ కాబట్టి మీకు ఇంకా ఆ మూవీ సెట్ అయ్యేదని నాని చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ మిస్ అయ్యినందుకు వెంకీ అభిమానులు ఫీల్ అవుతున్నారు. నాని బాగా చేశారు, కానీ వెంకీ మామ అయితే ఇంకా ఎఫక్టీవ్ గా ఉండేదని చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం అందరి మనసులు గెలుచుకున్నా కొన్ని ఏరియాలో కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదని చెబుతుంటారు.
ఇక 2001లో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో చిరంజీవి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా 'డాడీ'. ఈ మూవీ స్టోరీ బాగున్నప్పటికీ.. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కి ఆ కథని ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. దీంతో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే చిరుకి డాడీ కథ చెప్పగానే.. వెంకటేష్ అయితే బాగుంటాడని చెప్పారట. కానీ దర్శకనిర్మాతలు ఒప్పించడంతో చిరు చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత వెంకటేష్, చిరుకి ఫోన్ చేసి.. ఆ కథ నాకైతే ఇంకా బాగుండేదని చెప్పారట. అలా డాడీ మూవీ కూడా మిస్ అయ్యింది.
Next Story