Mon Dec 23 2024 07:43:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ రాకతో వెనక్కి వెళ్లే ఆలోచనలో వెంకటేష్, నాని..
టాలీవుడ్ లో ప్రభాస్ సినిమా రిలీజ్లు ఇతర మేకర్స్ కి పెద్ద సమస్య అయ్యిపోయింది. తాజాగా 'సలార్' పోస్ట్‌పోన్..
టాలీవుడ్ లో ప్రభాస్ (Prabhas) సినిమా రిలీజ్లు ఇతర మేకర్స్ కి పెద్ద సమస్య అయ్యిపోయింది. ఆ చిత్రాలు అనౌన్స్ చేసిన డేట్ కి రాకుండా, మరో తేదీకి షిఫ్ట్ అవుతుండడంతో.. ఆ సమయంలో రావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇతర దర్శకనిర్మాతలు వాళ్ళ వర్క్ అంతా పూర్తి అయినా ప్లాన్ చేసుకున్న డేట్ కి తమ మూవీని తీసుకు రాలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ 'సలార్' (Salaar) పోస్ట్‌పోన్.. వెంకటేష్, నానికి తలనొప్పి తెచ్చిపెడుతుంది.
ఈ నెలలో రావాల్సిన సలార్.. క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 22న రాబోతుందని సమాచారం. సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య కూడా ఇటీవల తన సోషల్ మీడియాలో.. 'ఈసారి డిసెంబర్ ఎప్పటిలా ఉండదు' అంటూ స్టోరీ పెట్టి రిలీజ్ ని కన్ఫార్మ్ చేసింది. ఇక క్రిస్ట్మస్ కి ప్రభాస్ రాక షురూ అవ్వడంతో.. ఆ టైములో వస్తున్న నాని, వెంకటేష్ సినిమా రిలీజ్లు ఆలోచనలో పడ్డాయి. వెంకటేష్ ‘సైంధవ్’ (Saindhav) డిసెంబర్ 22న, నాని 'హాయ్ నాన్న (Hi Nanna) 21న రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే ఇప్పుడు ఈ డేట్స్ నుంచి వెనక్కి వెళ్లి ఆలోచన చేస్తున్నారట ఇద్దరు మూవీ మేకర్స్. 'హాయ్ నాన్న' సినిమాని క్రిస్ట్మస్, సంక్రాంతికి మధ్య గ్యాప్ లో తీసుకు వద్దామని మూవీ టీం ఆలోచిస్తుందట. ఇక 'సైంధవ్' విషయానికి వస్తే.. సంక్రాంతికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. ఈ నెల 29న సలార్ టీం నుంచి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఆ అనౌన్స్మెంట్ తరువాత.. ఈ రెండు సినిమాల రిలీజ్ పై ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది.
ఇక ఈ పోస్ట్‌పోన్ వార్తలతో వెంకటేష్, నాని అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా 'సైంధవ్' సినిమాని శైలేష్ కొలను.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. 'హాయ్ నాన్న'ని కొత్త దర్శకుడు శౌర్యువ్.. ఎమోషనల్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమా మెయిన్ పాయింట్.. తండ్రి, కూతురు ప్రేమ.
Next Story