Sat Dec 21 2024 10:54:11 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : వెంకీమామ కూతురి పెళ్లి ఫోటోలు చూశారా..
ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా కూతురి పెళ్లి చేసేసిన వెంకీ మామ. ఫోటోలు చూశారా..!
Venkatesh : దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి ముగిసింది. టాలీవుడ్ హీరో వెంకటేష్ తన రెండో కూతుర్ని కూడా అత్తవారింటికి పంపించేశారు. గత ఏడాది అక్టోబర్ 25న చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిపించేసిన వెంకీ మామ.. పెళ్లి వేడుకను కూడా అంతే సింపుల్ గా జరిపించేసారు. నిన్న (మార్చి 15) ఈ వివాహ వేడుక జరిగింది.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. విజయవాడకి చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్కి వెంకటేష్ తన రెండో కూతురు హవ్యవాహినిని ఇచ్చి పెళ్లి చేసారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ కి మొత్తం ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయి ఆశ్రీతకి 2019లో వినాయక్ రెడ్డి అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని వివాహం జరుగుతుంది. కాగా వెంకటేష్ వంటి పెద్ద స్టార్ తన కూతురి పెళ్లిని చాలా సింపుల్ గా చేసేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
Next Story