Mon Dec 23 2024 20:10:12 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్లో పెళ్లి సందడి.. వెంకీ మామ రెండో కూతురు.. కీరవాణి రెండో కొడుకు..
టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలయింది. మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ లోని మరో రెండు కుటుంబాల్లో కూడా పెళ్లి భజంత్రీలు..
టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలయింది. ఆల్రెడీ మెగా కుటుంబంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ లోని మరో రెండు కుటుంబాల్లో కూడా పెళ్లి భజంత్రీలు మొగడానికి సిద్దమవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటిలో పెళ్లి సందడి మొదలు కాబోతుందట.
విక్టరీ వెంకటేష్ ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిలో ఆల్రెడీ పెద్ద అమ్మాయికి పెళ్లి అయ్యిపోయింది. ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి కుదిరినట్లు సమాచారం. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంలోని వరుడితో వెంకటేష్ తన రెండో కూతురి పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. రేపు అక్టోబర్ 25న వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుందని ఇండస్ట్రీ వ్యక్తులు చెబుతున్న మాటలు.
ఇక ఆస్కార్, నేషనల్ అవార్డు అందుకున్న ఎం ఎం కీరవాణి ఇంటిలో కూడా పెళ్లి సందడి మొదలు కాబోతుంది. కీరవాణి రెండో కొడుకు 'సింహా' హీరోగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడట. తెలుగు సీనియర్ నటుడు మురళి మోహన్ మనవరాలు 'రాగా మాగంటి'తో సింహా పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలోని వ్యక్తులు చెబుతూ వస్తున్నారు.
అయితే ఈ పెళ్లి వార్తలు గురించి.. ఆ కుటుంబాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయానికి వస్తే.. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ వివాహం జరగనుందని ఫిలిం వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. ఈ మెగా పెళ్లి వేడుకకు ఇటలీ వేదిక కానుంది. అక్కడి టుస్కానీ నగరంలోని ఒక హోటల్ లో ఈ వివాహ వేడుక ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.
Next Story