Mon Dec 15 2025 00:24:53 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
తమిళ, మలయాళ భాషల్లో విలన్ పాత్రలు పోషించిన కజాన్ ఖాన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు..

చిత్రపరిశ్రమ మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. గుండెపోటుతో ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ కన్నుమూశారు. తమిళ, మలయాళ భాషల్లో విలన్ పాత్రలు పోషించిన కజాన్ ఖాన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. కజాన్ ఖాన్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సెంతమిజ్ పట్టు తో తమిళంలోకి అడుగుపెట్టిన కజాన్ ఖాన్.. సేతుపతి IPS, కట్టుమరక్కరన్, మాప్పిళ్ళై గౌండర్ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఉల్లతై అల్లిత, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, ప్రియమానవాలే వంటి చిత్రాలలో విలన్ గా నటించారు. 2008లో విడుదలైన పట్టాయకెళప్పు భాషలో వచ్చిన చిత్రమే ఆయన చివరి సినిమా. కజాన్ ఖాన్ గంధర్వం, CID మూసా, ది కింగ్, వర్ణపకిట్టు, డ్రీమ్స్ వంటి సినిమాలతో మలయాళీలకు దగ్గరయ్యారు. కజాన్ ఖాన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

