Mon Dec 23 2024 14:16:04 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు సత్య రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం
సీనియర్ సినీ నటుడు సత్యరాజ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది
సీనియర్ సినీ నటుడు సత్యరాజ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదమ్మాళ్ కళింగరాయర్ (94) మృతిచెందారు. వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కోవైలో నివసిస్తున్న ఆమె అక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు కుమారుడు సత్యరాజ్, కుమార్తెలు మండ్రాడియార్, రూపా ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న నటుడు సత్యరాజ్ హైదరాబాద్ నుంచి చెన్నైకు హుటాహుటిన బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. సత్యరాజ్ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లోని సీనియర్ నటుల్లో సత్యరాజ్ ఒకరు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 240 చిత్రాలలో కనిపించాడు. మొదటిలో నెగటివ్ పాత్రలలో కనిపించి ఆ తరువాత హీరో అయ్యారు. సత్యరాజ్ బాహుబలి సినిమాలో 'కట్టప్ప' పాత్రతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులో ఇప్పుడు ఆయన ఎంతో బిజీ నటుడుగా ఉన్నారు.
Next Story