Mon Dec 23 2024 03:01:54 GMT+0000 (Coordinated Universal Time)
అలనాటి స్టార్ హీరోయిన్ కన్నుమూత : ప్రధాని సంతాపం
కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై దాదర్ లో సుశ్రూష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో వెంటవెంటనే రాజ్, శరత్ కుమార్ లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కు చెందిన అలనాటి స్టార్ హీరోయిన్ సులోచన లాట్కర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై దాదర్ లో సుశ్రూష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సులోచన లాట్కర్ వయసు 94 సంవత్సరాలు. స్వాతంత్య్రం రాకముందు కర్ణాటకలో పుట్టిన ఆమె.. ముంబైకి వెళ్లి 1940 లో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
కెరీర్ ఆరంభంలో హిందీ, మరాఠి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానే పలు సినిమాలు చేసింది. ఎక్కువగా అమ్మపాత్రల్లో కనిపించి.. బాలీవుడ్ అమ్మగా పేరు సంపాదించింది. 1980ల కాలంలో దాదాపు స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరికి అమ్మపాత్రలో నటించింది సులోచన. 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో 250కు పైగా హిందీ, మరాఠి సినిమాల్లో నటించింది. 1999లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చివరిగా 2007లో ఓ హిందీ సినిమాలో నటించింది. సులోచన లాట్కర్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
Next Story