Thu Dec 19 2024 17:07:36 GMT+0000 (Coordinated Universal Time)
మరో విషాదం: సీనియర్ నటి కన్నుమూత
600కి పైగా చిత్రాలలో పనిచేసిన లీలావతి కొన్ని సంవత్సరాలుగా నేలమంగళలో
ప్రముఖ దక్షిణాది నటి లీలావతి కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 600కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మళయాళం భాషల్లో నటించింది. లీలావతి కన్నడలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో గొప్ప పాత్రల్లో ఆమె నటించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో తుదిశ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కన్నడలో 400 చిత్రాలతో సహా 600కి పైగా చిత్రాలలో పనిచేసిన లీలావతి కొన్ని సంవత్సరాలుగా నేలమంగళలో తన నటుడు కుమారుడు వినోద్ రాజ్తో కలిసి ఉంటున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించిన లీలావతి ‘భక్త కుంబర’, ‘శాంత తుకారమ్’, ‘భట్క ప్రహ్లాద’, ‘మాంగల్య యోగం’, మన మెచ్చిద మదాడి వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. లీలావతి 16 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించారు. ఆమె ఎక్కువగా డాక్టర్ రాజ్కుమార్, M G రామచంద్రన్, N T రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి నటుల సరసన ప్రధాన పాత్రలు పోషించారు. ఆమె కన్నడ మ్యాట్నీ ఐడల్ డాక్టర్ రాజ్కుమార్తో కలిసి అనేక చిత్రాలలో పని చేశారు.
1949లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత కన్నడ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగారు. లీలావతికి కుమారుడు వినోద్ రాజ్ ఉన్నారు. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి నటుడు. లీలావతి 1949 లో శంకర్ సింగ్ నాగకన్నికే చిత్రంతో తెరంగేట్రం చేశారు. కథానాయికగా ఆమె నటించిన మొదటి చిత్రం మంగళ్యా యోగ. డా.రాజ్ కుమార్ తో ఆమె నటించిన తొలి చిత్రం రణధీర కంఠీరవ. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ లో కలిసి నటించారు. దక్షిణాదిన ఎన్నో గొప్ప సినిమాలలో ఆమె భాగమయ్యారు. కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె.. 6 దశాబ్దాల పాటూ చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు.
Next Story