Mon Dec 30 2024 19:45:04 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కన్నుమూత
హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోన్న నారాయణ్ దాస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు..
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్యమండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె. నారంగ్ (78) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోన్న నారాయణ్ దాస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
నారంగ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత అయిన నారంగ్ ప్రస్తుతం నాగార్జునతో 'ఘోస్ట్', ధనుశ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. నారంగ్ నిర్మాతగానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్ గా, మూవీ ఫైనాన్షియర్ గా కూడా పనిచేశారు.
Next Story