Sun Jan 12 2025 09:31:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ సింగర్ భూపీందర్ సింగ్ మృతి
ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మరణించారు.
ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మరణించారు. ఐదు దశాబ్దాల పాటు భూపేందర్ సింగ్ తన పాటలతో అలరించారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కోవిడ్ అనంతరం సమస్యలతో పాటు, కోలన్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూపేందర్ సింగ్ కన్ను మూశారు.
దిగ్గజ గాయకుడిగా....
దిగ్గజ గాయకులైన మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కు సమకాలీకుడు భూపేందర్ సింగ్, ఆయన భార్య మిథాలీ సింగ్ కూడా ప్రముఖ గాయకురాలే. అనేక బాలివుడ్ చిత్రాల్లో పాటలు పాడి భూపేందర్ సింగ్ అలరించారు. అనారోగ్య సమస్యలతో పది రోజుల క్రితం ముంబై ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి మృతి చెందారు. భూపేందర్ సింగ్ మృతి పట్ల రాజకీయ నేతలతో పాటు బాలివుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story