Mon Dec 23 2024 07:34:00 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2020 ఏడాదికి సంబంధించి..
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఉత్తమ నటీనటులకు ఇవ్వడం ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ఈ పురస్కారాన్ని దేవికా రాణికి అందచేశారు. తెలుగులో మొట్టమొదటిగా ఈ అవార్డును అందుకున్నది దర్శకనిర్మాత అయిన బియన్ రెడ్డి. ఇప్పటి వరకూ 51 మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో సీనియర్ నటి ఆపరేఖ్ పేరు కూడా చేరింది.
బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు పరేఖ్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును పరేఖ్ అందుకోనున్నారు. 1942 అక్టోబర్ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించిన పరేఖ్... బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1952లో వచ్చిన మా చిత్రంలో తెరంగేట్రం చేసిన పరేఖ్.. పదేళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 1959లో విడుదలైన దిల్ దేకే దేఖో చిత్రంలో ఆమె హీరోయిన్గా మారారు. కతీ పతంగ్, మేరా గావ్ మేరా దేశ్, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు పరేఖ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Next Story