Mon Dec 23 2024 11:32:27 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..
1994లో తొలిసారిగా అరమనై కవలన్ సినిమాకు మురళీధరన్ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మీ మూవీ మేకర్స్ పై.. కమలహాసన్ (అన్బే శివమ్
ప్రముఖ తమిళ నిర్మాత కె మురళీధరన్ గుండెపోటుతో కన్నుమూశారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆయన మెట్లు ఎక్కుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారు. మురళీధరన్ తమిళంలో నిర్మించిన గోకులాతిల్ సీతై ను తెలుగులో 'గోకులంలో సీత'గా రీమేక్ చేసి.. పవన్ కల్యాణ్ హిట్ కొట్టారు. తమిళ స్టార్ హీరోలతో మురళీధరన్ పనిచేశారు.
1994లో తొలిసారిగా అరమనై కవలన్ సినిమాకు మురళీధరన్ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మీ మూవీ మేకర్స్ పై.. కమలహాసన్ (అన్బే శివమ్), విజయ్ కాంత్ (ఉల్వతురై), కార్తీక్ (గోకులాతిల్ సీతై), అజిత్ (ఉన్నై తెడి), విజయ్ (ప్రియముదన్), ధనుష్ (పుదుపెట్టాయ్), శింభుతో శిలమ్ బట్టమ్ సినిమాలు నిర్మించారు. చివరిగా ఆయన నిర్మించిన సినిమా సకల కళా వల్లవన్ (జయమ్ రవి, త్రిష, అంజలి) 2015లో విడుదలైంది. కె.మురళీధరన్ మృతి పట్ల కమలహాసన్ సంతాపం వ్యక్తం చేశారు.
Next Story