మీడియా ఇప్పటికే మా పెళ్లిని 20 సార్లుచేసింది!!
ఈమాటన్నది ఎవరో కాదు.. తమిళ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్. నయనతార లవర్ దర్శకుడు విగ్నేష్ శివన్ తన పెళ్లిపై స్పందించాడు. అసలు ఈ కరోనా టైం [more]
ఈమాటన్నది ఎవరో కాదు.. తమిళ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్. నయనతార లవర్ దర్శకుడు విగ్నేష్ శివన్ తన పెళ్లిపై స్పందించాడు. అసలు ఈ కరోనా టైం [more]
ఈమాటన్నది ఎవరో కాదు.. తమిళ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్. నయనతార లవర్ దర్శకుడు విగ్నేష్ శివన్ తన పెళ్లిపై స్పందించాడు. అసలు ఈ కరోనా టైం లోనే విగ్నేష్ శివన్ – నయనతారలు పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకోసమే వాళ్లిద్దరూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూజలు చేస్తున్నారంటూ.. మీడియాలో ప్రచారం జరిగింది. కరోనా టైం లో పెళ్లి చేసుకుని.. తర్వాత కరోనా తగ్గాక గ్రాండ్ గా రిసెప్షన్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే నిజంగానే విగ్నేష్ శివన్ – నయనతారలు పెళ్ళికి రెడీ అయ్యారని.. చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న వీరు ఎట్టకేలకు కరోనా టైం లో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ ఫిక్స్ అయితే తాజాగా విగ్నేష్ శివన్ మాత్రం తాము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో అప్పుడే చేసుకుంటామంటూ షాకివ్వడమే కాదు… తనకి కెరీర్ లో సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయంటున్నారు.
అసలు తమ పెళ్లిపై మీడియాలో ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉంటాయని..అయితే అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన విగ్నేష్ శివన్…. కెరీర్లో తాను సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే తాము డేటింగ్ లో ఉన్నామని.. .డేటింగ్ బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పి షాకిచ్చాడు విఘ్నేష్. అంత వరకు నేను కానీ నయన్ కానీ పెళ్లి గురించి ఆలోచించమని చెప్పిన విగ్నేష్.. మీడియా తమ పెళ్లి ఇప్పటికే 20 సార్లకు పైగానే చేసి ఉంటుందని అంటూ చమత్కరించాడు ఇక ఈమధ్యన నేను నయనతార కరోనా బారిన పడ్డామంటూ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే అది నిజమో కాదో తెలుసుకోకుండా అలా ప్రచారం చెయ్యడం కాస్త బాధ అనిపించింది అని అంటున్నాడు విగ్నేష్ శివన్.