Tue Dec 24 2024 02:36:38 GMT+0000 (Coordinated Universal Time)
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి తీవ్రగాయాలు.. షూటింగ్ లో ప్రమాదం
ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేతిలో ఉన్న విజయ్.. బిచ్చగాడు 2 చిత్రీకరణలో..
బిచ్చగాడు సినిమాతో తెలుగులో పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ కెరీర్ టర్న్ అయింది. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేతిలో ఉన్న విజయ్.. బిచ్చగాడు 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మలేషియాలోని కౌలాలంపూర్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. కౌలాలంపూర్ లో వేసిన సెట్ లో విజయ్ ఆంటోనీకి తీవ్రగాయాలయ్యాయి.
విజయ్ వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్రయూనిట్ తెలిపింది. వాటర్ బోట్ అదుపుతప్పి కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్ కు తీవ్రగాయాలు కావడంతో.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఆయన కోలుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా.. విజయ్ ఆంటోనీ కేవలం నటుడిగానే కాకుండా.. మ్యుజీషియన్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పిచైకారన్ 2, కొలై, రత్తం తదితర సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు.
Next Story