Tue Dec 24 2024 02:40:50 GMT+0000 (Coordinated Universal Time)
నా కూతురుతో పాటే నేను చనిపోయాను.. విజయ్ ఆంటోనీ లేఖ..
కూతురు మరణంపై తొలిసారి స్పందించిన విజయ్ ఆంటోనీ. కూతురుతో పాటే తను కూడా చనిపోయాను..
తమిళ హీరో కమ్ సంగీత దర్శకుడు 'విజయ్ ఆంటోనీ' పెద్ద కూతురు 'మీరా' ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ విషయం పై విజయ్ ఆంటోనీ తాజాగా స్పందించాడు. తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు. ఇక ఆ లెటర్ లో విజయ్.. తన కూతురితో పాటు తను కూడా చనిపోయానంటూ భావోద్వేగానికి గురైయ్యారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది.
"నా కూతురు మీరా ఎంతో ప్రేమగాను, ధైర్యంగాను ఉంటుంది. ఇప్పుడు ఆమె కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం అనేవి లేని ఒక ప్రశాంతమైన ప్రపంచానికి వెళ్ళింది. తను ప్రస్తుతం నాతో లేకున్నా, ఇంకా నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. తనతో పాటే నేను కూడా చనిపోయాను. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరుతోనే మొదలుపెడతాను" అంటూ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు.
కాగా ఈ ఆత్మహత్య ఘటన సెప్టెంబర్ 19న జరిగింది. 16 ఏళ్ళ వయసున్న మీరా.. ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తమిళ మీడియాలో పేర్కొంటున్నాయి. ఈక్రమంలోనే మీరా ఇలా ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆళ్వార్‌పేటలోని విజయ్ ఆంటోనీ నివాసంలో మీరా తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని మరణించింది.
విజయ్ ఆంటోనీ కి మొత్తం ఇద్దరు పిల్లలు. లారా, మీరా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మీరా పెద్ద అమ్మాయి అని సమాచారం. కాగా ఇటీవల విజయ్ ఆంటోనీకి కూడా పెద్ద ప్రమాదం జరిగింది. బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన విజయ్ చావు అంచులు వరకు వెళ్లి వచ్చాడు. అది జరిగి నెలలు గడవకు ముందే ఇలా జరగడం.. విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తుంది.
Next Story