ఎందుకు తమ్ముణ్ణి దూరం పెడుతున్నాడు
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చిన్న చిన్న కేరెక్టర్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ [more]
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చిన్న చిన్న కేరెక్టర్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ [more]
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చిన్న చిన్న కేరెక్టర్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ స్టార్ హీరో గా ఎదిగాడు. యాటిట్యూడ్, హీరోయిజం అన్ని విజయ్ కి లక్కులా కలిసొచ్చాయి. ప్రస్తుతం ఫుల్ క్రేజున్న హీరోగా విజయ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇక విజయ్ కి మరో రెండు హిట్స్ పడ్డాయి అంటే టాలీవుడ్ లో విజయ్ స్థానానికి తిరుగే ఉండదు. అయితే అలాంటి టైం లోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా విజయ్ అండతో సినిమాల్లోకి వచ్చేసాడు.
ఆనంద్ హీరోగా శివాత్మిక హీరోయిన్గా దొరసాని సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే దొరసాని సినిమా టీజర్ విడుదలైంది. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ గురించి పట్టించుకోవట్లేదనిపిస్తుంది. ఎందుకంటే దొరసాని టీజర్ బావుంది అనికాని.. మరేదో అని కానీ ఒక్క ట్వీట్ కూడా తమ్ముడి కోసం చెయ్యలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా తన తమ్ముడు ఆనంద్ కూడా టాలెంట్ ఉంటె పైకొస్తాడని, లక్కుంటే సక్సెస్ అవుతాడని చెబుతున్నాడు కానీ… తన తమ్ముడిని మాత్రం సపోర్ట్ చేస్తూ అతని సినిమా పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమ్మునుంటున్నాడు. అసలు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవేరకొండ సినిమాని ప్రమోట్ చేసే ఉద్దేశ్యం లేదు. నిజంగా టాలెంట్ ఉంటే పైకొస్తాడు.. అంతేకాని నేను ప్రమోట్ చేస్తే హిట్ కొట్టాడనే విజయ్ దేవరకొండ కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ.. ఫస్ట్ టైం తమ్ముడు ఇండస్ట్రీలోకొస్తే.. విజయ్ అలా సైలెంట్ గా ఉండడం మాత్రం విజయ్ ఫాన్స్ కి రుచించడం లేదు.