Sun Dec 22 2024 22:01:28 GMT+0000 (Coordinated Universal Time)
అట్టహాసంగా VD12 లాంచ్.. క్రేజీ కాంబినేషన్
నేడు (మే3) హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల విజయ్ సరసన నటిస్తోంది.
టాలీవుడ్ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణతో.. సమంతతో కలిసి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ షూటింగ్ జరుగుతుండగానే విజయ్ దేవరకొండ మరో సినిమాను లాంచ్ చేశాడు. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఇది విజయ్ దేవరకొండకు 12వ సినిమా.
నేడు (మే3) హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల విజయ్ సరసన నటిస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. ఇంతకన్నా క్రేజీ కాంబినేషన్ ఉంటుందా ? అంటున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నాడు. తెలుగులో పెళ్లిసందడి, ధమాకా వంటి రెండు హిట్లతో ఉన్న శ్రీలీల కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇక విజయ్ కూడా లైగర్ వంటి డిజాస్టర్ నుండి బయటపడేందుకు లవ్ ట్రాక్ ను ఎంచుకుని ఖుషి సినిమా చేస్తున్నాడు.
Next Story