బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ..!
విజయ్ దేవరకొండ త్వరలోనే బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’తో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో [more]
విజయ్ దేవరకొండ త్వరలోనే బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’తో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో [more]
విజయ్ దేవరకొండ త్వరలోనే బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’తో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ తో చేయబోయే సినిమాలో బైక్ రేసర్ గా విజయ్ కనిపిస్తాడు. ఈ మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మించనున్నారు. ఇందుకోసం ఆల్రెడీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాడు. చెన్నైలో ఒక రేస్ ట్రాక్ పై ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. విజయ్ బైక్ రేసింగ్ లో పర్ఫెక్ట్ అయిన తరువాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఢిల్లీలోని రేస్ ట్రాక్ మీద ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. బైక్ రేసింగ్ అంటే ఆషామాషీ కాదు అందుకే విజయ్ చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తునట్టు టాక్. అయితే ఈ మూవీ ఎప్పుటినుండి స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.