Fri Dec 27 2024 05:01:03 GMT+0000 (Coordinated Universal Time)
సమంతతో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు, సమంతతో కలిసి చేస్తున్న సినిమా బృందంలో జరిగాయి. సమంతతో కలిసి `వీడీ11` వర్కింగ్
హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సోమవారం 33వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు. 2011లో రవిబాబు తీసిన రొమాంటిక్ కామెడీ 'నువ్విలా'తో అరంగేట్రం చేసాడు. ఇంకొన్ని సినిమాల్లో సపోర్ట్ క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రమణ్యంలో విజయ్ దేవరకొండ పాత్రకు మంచి గుర్తింపు రాగా.. 2016 రొమాంటిక్ కామెడీ పెళ్లి చూపులతో సోలో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు. `పెళ్లి చూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు, సమంతతో కలిసి చేస్తున్న సినిమా బృందంలో జరిగాయి. సమంతతో కలిసి `వీడీ11` వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతుంది. షూటింగ్లో భాగంగానే అర్థరాత్రి విజయ్ దేవరకొండ బర్త్ డేనిసెలబ్రేట్ చేశారు. కొద్దిరోజుల కిందట సమంత పుట్టినరోజును కూడా ఈ సినిమా సెట్స్ లోనే సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే..!
పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా తర్వాత జనగణమన కూడా ఉండబోతోంది. ఇప్పుడు పూరీ ఓ కొటేషన్ తో విజయ్ దేవరకొండకు విషెస్ చెప్పారు. `నేను నీ హార్ట్ లోని ఫైర్ చూశా. నీ లోపల ఉన్న ఫైన్ యాక్టర్‌ని చూశా. నీ మైండ్‌లో ఏం ఏముందో నాకు తెలుసు. నీ ఆకలి, నీ మ్యాడ్నెస్, నీ కమిట్మెంట్, నీ హంబుల్‌నెస్ అన్ని నిన్ను ఓ స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. ఒకరోజు నువ్వు దేశం గర్వించే వ్యక్తిగా నిలుస్తావు. అప్పుడు నేను నిన్ను పిలుస్తాను ది విజయ్ దేవరకొండ. హ్యాపీ బర్త్ డే` అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖులు, అభిమానులు విజయ్ దేవరకొండకు విషెష్ చెప్పారు. `లైగర్` చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది.
Next Story