విజయ్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు
నిన్న జరిగిన దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ బాగా ఎమోషనల్ అయ్యాడు. దాని కారణం కూడా విజయ్ మాటల్లోనే విందాం. తన తమ్ముడు [more]
నిన్న జరిగిన దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ బాగా ఎమోషనల్ అయ్యాడు. దాని కారణం కూడా విజయ్ మాటల్లోనే విందాం. తన తమ్ముడు [more]
నిన్న జరిగిన దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ బాగా ఎమోషనల్ అయ్యాడు. దాని కారణం కూడా విజయ్ మాటల్లోనే విందాం. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అమెరికా లో జాబ్ చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపేవాడని, అలానే తన కుటుంబాన్ని ఆదుకున్నాడని, తను నటుడు అవ్వడానికి అతను ఎంతో సాయ పడ్డాడని విజయ్ చెప్పాడు.
అలాంటిది ఆనంద్ సడన్ గా జాబ్ మానేసి ఇక్కడికి వచ్చేసాడు. అది నాకు నచ్చలేదు. సినిమా చేస్తా అన్నప్పుడు కూడా నచ్చలేదు. తనంతట తానే సినిమా చేసుకోమని..స్క్రిప్ట్స్ నువ్వే వినాలని,అన్ని నువ్వే చేసుకొవాలని, ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదురుకోవాలి, అవమానాలు, ట్రొలింగ్ లు భరించే శక్తి రావాలని, అన్ని రాటు దేలాలని అలా చేసానని చెప్పాడు. ఇవన్నీ తాను బలవంతంగా చేసానని, నాకు సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్ బాగా నచ్చినా ఎక్కడ మాట్లాలేదు.
ఎవరన్నా మీ తమ్ముడు సినిమా ఎలా వస్తుంది అని అడిగిన నాకు తెలియదు అని చెప్పాను. కానీ వారు అన్ని దాటుకుని సినిమా ను కంప్లీట్ చేసారు. నేను చిన్న హెల్ప్ కూడా చేయలేదు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలి అని నన్ను అడిగినప్పుడు నేను సినిమా చూపిస్తేనే వస్తా అని చెప్పడం నాకు సినిమా మొత్తం చూపించారు. సినిమా చూసాక నేను షాక్ అయ్యాను.ఈ పిల్లలు అంతా కలిసి ఇంత మంచి సినిమా చేసారా? అని అనిపించిందని విజయ్ అన్నాడు. ఇది కచ్చితంగా అందరికి నచ్చుతుందని భావిస్తున్న అని విజయ్ చెప్పాడు. ఇక ఈమూవీ ఈ వారం అంటే 12న రిలీజ్ అవుతుంది.