విజయ్ క్రేజ్ కి నిదర్శనం
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ హీరో ఎవరయ్యా అనగానే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తారు. చాల తక్కువ సమయంలోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించినా [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ హీరో ఎవరయ్యా అనగానే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తారు. చాల తక్కువ సమయంలోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించినా [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ హీరో ఎవరయ్యా అనగానే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తారు. చాల తక్కువ సమయంలోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించినా విజయ్ దేవరకొండ రెండు మూడు సినిమాల్తోనే బాగా పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమా ల్తో యూత్ నే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ కి విజయ్ దేవరకొండ బాగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతోనేనా.. రౌడీ బ్రాండ్ మీద వ్యాపారం మొదలెట్టేసాడు. అలాగే యూత్ ఐకాన్ గా విజయ్ దేవరకొండ తెగ పాపులర్ అయ్యాడు. అటు డ్రెస్సింగ్ స్టయిల్, ఇటు ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే సినిమాల్లో స్టార్ హీరో రేంజ్ అన్నిటికి కలిపి విజయ్ ని అందనంత ఎత్తుకు ఎదిగేలా చేశాయి.
ఇన్ని సాధించిన విజయ్ దేవరకొండకి 2019 – ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో చోటు దక్కింది. ఇండియాలో ముప్పై ఏళ్ళు కన్నా తక్కువ వయసుకు ఉన్నవారు…. తాము పనిచేసే రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం కల్పిస్తారు. అయితే అందుకు సంబందించిన జాబితాను ఈ ఏడాదికి గాను ఈ జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. అయితే 29 ఏళ్ళ విజయ్ దేవరకొండ హీరోగా, నటుడిగా చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ని సంపాదించడం, అలాగే తన ప్రతిభను చూపినందుకు గాను ఫోర్బ్స్ లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ పేరు ఎక్కింది. మరి ఇలా విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ లోకెక్కి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. మరోపక్క రౌడీ అభిమానులు మాత్రం విజయ్ క్రేజ్ కి ఈ ఫోర్బ్స్ జాబితాలో అతని పేరు రావడం నిదర్శనమంటున్నారు.