Mon Dec 23 2024 05:42:22 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో విజయ్ దేవరకొండకు ఇంత ఫాలోయింగ్ ఉందా?
విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' సినిమా
విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' సినిమా తమిళనాడులో మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 7 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. వీక్ డేస్ లో కూడా సినిమా వసూళ్లు తగ్గలేదు. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఇంకా పెరిగే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఖుషి మూవీ సెప్టెంబర్ 1న రిలీజైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్తో పాటు రివ్యూలపై ఖుషి ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. సోషల్మీడియా, యూట్యూబ్ ద్వారా నా మీద, ఖుషి సినిమా మీద చాలా మంది కావాలనే ఎటాక్ చేస్తున్నారని విజయ్ ఆరోపించాడు. ఈ అడ్డంకులన్నీ అభిమానుల ప్రేమతోనే దాటగలిగానని విజయ్ చెప్పాడు. అభిమానుల ప్రేమ చూస్తుంటే ఆ కష్టాల గురించి మాట్లాడాలని అనిపించడం లేదని, వాటి సంగతి మరో రోజు చూసుకుందామని విజయ్ అన్నాడు.
Next Story